కల్తీ నెయ్యి ఘటనలో వైవీ సుబ్బారెడ్డి సంచలన డిమాండ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-11-27 08:34:20  IST  )

కల్తీ నెయ్యి ఘటనలో వైవీ సుబ్బారెడ్డి సంచలన డిమాండ్ చేశారు..

కల్తీ నెయ్యి ఘటనలో వైవీ సుబ్బారెడ్డి సంచలన డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala) కల్తీ నెయ్యి(Adulterated Ghee) ఘటనలో మాజీ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి(Former TTD Chairman YV Subba Reddy) సంచలన డిమాండ్ చేశారు. 2014-19 చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనూ కల్తీ జరిగిందని ఆయన ఆరోపించారు. అంతేకాదు ఆసమయంలో జరిగిన కల్తీపైనా దర్యాప్తు చేయాలన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో రూ. 80 కోట్లతో అత్యాధునిక టెస్ట్ ల్యాబ్‌ తయారు చేసి నెయ్యిని పరీక్షించామని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వ హయామే కాదని, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ టీటీడీకి సరఫరా అయిన నెయ్యి వ్యవహారంలోనూ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

దేనికైనా సిద్ధమే..


2019కు ముందు భక్తులు సమర్పించిన కానులు, దానాలు, తిరుమల తిరుపతి దేవస్ధానం నిధులు మొత్తం రూ. 1200 కోట్లను ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేశారని, జగన్ హయాంలో వాటిన్నింటిని విత్ డ్రా చేసి ప్రభుత్వ బ్యాంకుల్లో వేశామని చెప్పారు. టీటీడీ నిదుల ద్వారా లబ్ధి పొందే ఆలోచనే తమకు లేదని తెలిపారు. కొందరు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఏ విచారకైనా తాను సిద్ధమేనని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. కల్తీ నెయ్యి ఘటనలో ఆయనను పోలీసులు విచారించిన నేపథ్యంలో వివరణ ఇచ్చారు.

ఏ తప్పు చేయలేదు

తాను ఏ తప్పు చేయలేదని తెలిపారు. తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి టీటీడీపై గౌరవాన్ని తగ్గించారన్నారు. లడ్డూ ప్రసాదంపై ఇప్పటివరకూ చంద్రబాబు క్లారిటీగా చెప్పలేదన్నారు. తమ హయాంలో అధిక ధరలతో నెయ్యి కొనుగోలు చేయలేదని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

Next Story