వైసీపీ ఎప్పటికీ ఓ సైకో పార్టీనే.. నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-14 15:20:20  IST  )

తన దృష్టిలో వైసీపీ (YCP) ఎప్పటికీ ఓ సైకో పార్టీనే అని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు.

వైసీపీ ఎప్పటికీ ఓ సైకో పార్టీనే.. నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తన దృష్టిలో వైసీపీ (YCP) ఎప్పటికీ ఓ సైకో పార్టీనే అని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. తాజాగా, మైలవరంలో ఓ పిల్లాడి చేతిలోంచి సైకిల్ (Bicycle) లాక్కొని టీడీపీని టార్గెట్‌గా చేసుకుని వైసీపీ నేతలు చేసిన హంగామా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే అదే వీడియోపై తాజాగా మంత్రి లోకేశ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘X’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. అబ్బే వాళ్లేమి మారలేదు.. మారరు కూడా అంటూ కామెంట్ చేశారు.

ఏ ముహూర్తాన సైకో పార్టీ అని పేరు పెట్టామో.. కానీ ఆ పేరును సార్ధకం చేసుకోవడానికి నిరంతరం పని చేస్తూనే ఉంటారని సెటైర్లు వేశారు. అందుకే నాటికి.. నేటికీ ఎప్పటికీ అదొక సైకో పార్టీ అని.. వాళ్లకి సైకో నాయకుడు అని ఫైర్ అయ్యారు. ప్రజలు బుద్ధి చెప్పినా మారని వాళ్ల ఆలోచనలను.. చిన్న పిల్లవాడి చేతిలో నుంచి సైకిల్ లాక్కొని దాన్ని తొక్కుతూ, విరగ్గొడుతూ చేస్తున్న వికృత చేష్టలను సమాజం మరింత‌గా అర్థం చేసుకోవాలనే తాను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా అంటూ కామెంట్ చేశారు. తాజాగా మైలవరం‌ (Mailavaram)లో ఓ మాజీ మంత్రి ఇంట్లో శుభకార్యానికి వచ్చి వాళ్లు చేసిన పిచ్చి చేష్టలను తీవ్రంగా ఖండిస్తున్నా అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.

Next Story