- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పార్లమెంట్ ప్రాంగణంలో వైసీపీ ఎంపీల నిరసన
పార్లమెంట్ సమావేశాల వేళ వైసీపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లపై దాడిని నిరసిస్తూ పార్లమెంట్ ముందు ఆందోళనకు దిగారు.

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ సమావేశాల వేళ వైసీపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లపై దాడిని నిరసిస్తూ పార్లమెంట్ ముందు ఆందోళనకు దిగారు. వీ వాంట్ జస్టిస్ అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ కాపాడాలని అన్నారు. ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై దాడులు పరిపాటిగా మారాయని మండిపడ్డారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ఇటీవల మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే.
ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయను అడ్డుకోవడం, దాడి చేసేందుకు ప్రయత్నించడంతో ఆయన రెచ్చిపోయారు. సీఎం చంద్రబాబును పరుషపదజాలంతో దూషించారు. దీంతో టీడీపీ శ్రేణులు అంబటి ఇంటిని ముట్టడించారు. ఈ క్రమంలో అక్కడ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అంబటి ఇంట్లోని కార్లు సైతం తగలబెట్టారు. మరోవైపు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటికి సైతం నిప్పుపెట్టారు. చంద్రబాబు, లోకేశ్ పై జోగి రమేశ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆయన ఇంటిపై రాళ్లదాడికి పాల్పడ్డారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.






