- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వంపై పోరాడతాం: వైవీ సుబ్బారెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
రైతుల పక్షాన పోరాడి యూరియా కష్టాలు తీర్చటానికి కృషి చేశామని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు..

దిశ, వెబ్ డెస్క్: రైతుల పక్షాన పోరాడి యూరియా(Urea) కష్టాలు తీర్చటానికి కృషి చేశామని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి(Ycp MP Subbaredddy) అన్నారు. NTR జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్(Devineni Avinash) అధ్యక్షతన జరిగిన జిల్లా పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తమ దృష్టిలో ఉన్నాయని, కేసులకు భయపడాల్సిన పని లేదన్నారు. వర్షాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని చెప్పారు. డయేరియా బాధితులను అలాగే వదిలేసిందని విమర్శించారు. జగన్ దూర దృష్టితో 17 మెడికల్ కాలేజీలు కి శ్రీకారం చుడితే ప్రభుత్వం వాటిని ప్రైవేట్ పరం చేస్తుందని తెలిపారు. విద్యా వైద్యం పేదలకు అందుబాటులో ఉంచాలని జగన్ పని చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. కల్తీ మద్యం చేసింది కూటమి ప్రభుత్వం అని ..నిందలు వేసేది మాత్రం వైసీపీ మీద అని ధ్వజమెత్తారు. ‘గ్రామ మండల స్థాయి కమిటీలు అన్ని పూర్తి చేస్తాం. పార్టీ అధినేత జగన్ ఆదేశం ప్రకారం 29 అనుబంధ విభాగాల నియామకం జరుగుతుంది. కోటి సంతకాల సేకరణ చేస్తాం, దాని ద్వారా ప్రభుత్వం పై పోరాడతాం.’’ అని వైవీ సుబ్బారెడ్డి వార్నింగ్ ఇచ్చారు.






