- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శాసనమండలిలో మళ్లీ వైసీపీ ఆందోళనలు.. కూటమి సభ్యుల అసహనం
ఇందాపూర్ - హెరిటేజ్ డెయిరీల అంశంపై చర్చించాలని వైసీపీ సభ్యులు మండలిలో పట్టుపట్టారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ శాసనమండలి సమావేశాలు రెండ్రోజుల వాయిదా అనంతరం సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యులు మళ్లీ ఇందాపూర్ - హెరిటేజ్ డెయిరీలపై చర్చించాలని పట్టుపట్టారు. ఈ అంశంపై వాయిదా తీర్మానాన్ని చైర్మన్ కు అందించగా.. దానిని చైర్మన్ మోషేన్ రాజు తిరస్కరించారు. దీంతో చైర్మన్ పోడియంను చుట్టుముట్టి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. వైసీపీ సభ్యుల ఆందోళనతో మండలి మళ్లీ గందరగోళంగా మారింది. పోడియంను చుట్టుముట్టిన వారిని వెనక్కి పంపాలని కూటమి మంత్రులు, ఎమ్మెల్సీలు చైర్మన్ కు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. వైసీపీ సభ్యులు పోడియంకు దూరంగా వెళ్లాలని చైర్మన్ చెప్పినా.. ఆందోళన ఆపకపోవడంతో.. వారి ఆందోళన మధ్యే మండలిని కొద్దిసేపు వాయిదా వేశారు. మరోవైపు కూటమి మంత్రులు వైసీపీ సభ్యుల తీరుపై మండిపడుతున్నారు. నాలుగురోజులుగా సభలో ఇదే తంతు రిపీట్ అవుతోందని, బడ్జెట్ పై చర్చ జరగనివ్వడం లేదని వాపోతున్నారు.






