AP News : వైసీపీ నేతలకు మొహం చెల్లక అసెంబ్లీకి రావడం లేదు : పయ్యావుల కేశవ్

by Muthe.Rajitha |

వైసీపీ ఎమ్మెల్యేల(YCP MLA's)పై ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్(Payyavula Keshav) మరోసారి మండిపడ్డారు.

AP News : వైసీపీ నేతలకు మొహం చెల్లక అసెంబ్లీకి రావడం లేదు : పయ్యావుల కేశవ్
X

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ ఎమ్మెల్యేల(YCP MLA's)పై ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్(Payyavula Keshav) మరోసారి మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేలు గతంలో చేసిన తప్పులకు మొహం చెల్లక అసెంబ్లీలో అడుగు పెట్టడానికి భయపడుతున్నారని అన్నారు. అసలు సభకు రాకుండా ఉన్నవి లేనివి కల్పించి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వారు చేసిన తప్పులను తాము ఎత్తి చూపుతామని భయపడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐదేళ్ల పాటు ఆర్థిక విధ్వంసం సృష్టించారని, ఐదేళ్ల నుంచి రాష్ట్రానికి ఆదాయం రావడమే ఆగిపోయిందని తెలిపారు. రాష్ట్ర ఆదాయం, కేంద్రం నుంచి వచ్చేది రూ.1,54,065 కోట్లు అయితే అప్పులు రూ. 63 వేల కోట్లు, జీత భత్యాలు అప్పుల వడ్డీలు రూ. 65 వేల కోట్లు ఉందన్నారు. మిగిలిన ఆ కొద్ది మొత్తంతో ఏడాది పాలన ఎలా సాగుతుందో వైసీపీ నేతలు చెప్పాలని నిలదీశారు. రాష్ట్రాన్ని గాలికి వదిలివేయడం వల్లే ఎన్నికల్లో ప్రజలు గట్టి బుద్ధి చెప్పారని తెలిపారు. రాష్ట్రంలో పాలన సాగలంటే కొత్త అప్పులు చేయడం తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో మార్గం లేదన్నారు.

Next Story