వెంకటగిరి వైసీపీలో విభేదాలు.. ఎంపీ గురుమూర్తిపై రామ్ కుమార్ రెడ్డి సెన్సేషనల్ వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

ఎంపీ గురుమూర్తిపై వైసీపీ నేత రామ్ కుమార్ రెడ్డి సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు...

వెంకటగిరి వైసీపీలో విభేదాలు.. ఎంపీ గురుమూర్తిపై రామ్ కుమార్ రెడ్డి సెన్సేషనల్ వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా వెంకటగిరి(Venkatagiri)లో 2029 ఎన్నికలపై ఇప్పటి నుంచే వైసీపీ(Ycp) నేత ఫోకస్ పెట్టారు. ఈ మేరకు వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఆశావహులకు ఛాన్స్ ఇవ్వకుండా ఇప్పటి నుంచే బెర్త్‌పై కర్చీఫ్ వేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో సీటు తమకేనంటూ దీమా చెబుతున్నారు. ఆ నేత ఎవరో కాదు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి(Nedurumalli Ram Kumar Reddy). గత ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆనం వెంకటరామిరెడ్డి(Anam Venkatrami Reddy)పై రామ్ కుమార్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. జిల్లాలో ఎంపీ మద్దిల గురుమూర్తి తప్ప ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు. అయితే ఎంపీ గురుమూర్తి, రామ్ కుమార్ రెడ్డి విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో రామ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేది తానేనని చెప్పారు. ఎంపీ గురుమూర్తి ప్రమోషన్‌ తనకు అవసరం లేదని తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడే ఉంటానని చెప్పారు. ఆశావహులు ఎవరైనా ఉంటే ప్రత్యామ్నాయం చూసుకోవాలని నేదురుమల్లి రామ్‌కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు.

Next Story