అమరావతికి డీజిల్‌ తరలించడతోనే కొరత: వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ఇంధన కొరతపై వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని డీజిల్‌ను అమరావతి పనుల కోసం తరలించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన విమర్శించారు.....

అమరావతికి డీజిల్‌ తరలించడతోనే కొరత: వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ఇంధన కొరత(Fuel shortage)పై వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని డీజిల్‌ను అమరావతి పనుల కోసం తరలించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన విమర్శించారు. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్షాలపై దుష్ప్రచారం చేస్తోందని, చంద్రబాబు నాయుడు(Chandrababu) కేవలం రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా పారిశ్రామిక విధానంపై స్పందిస్తూ.. కూటమి ప్రభుత్వం కేవలం 99 పైసలకే భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతోందని, దీనివల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లుతోందని ఆరోపించారు.

పారిశ్రామిక రంగం కుదేల్

గత వైసీపీ(Ycp) ప్రభుత్వ హయాంలో అదానీ, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలకు పారదర్శకంగా భూములు కేటాయించామని, కానీ ప్రస్తుత పాలనలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతపడుతున్నాయని సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పారిశ్రామిక రంగం కుదేలైందని ఆయన విమర్శించారు. ఇక రాజకీయాల విషయానికొస్తే, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా ఎదుర్కోవడానికి వైసీపీ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎన్నికల్లో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు.

Next Story