- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేనెప్పుడూ గీత దాటి ప్రవర్తించలేదు: కేసులపై పూడి శ్రీహరి కీలక వ్యాఖ్యలు
వైసీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి హైకోర్టుతో పాటు గుంటూరు కోర్టులోనూ ఊరట లభించింది. సీఎం చంద్రబాబుపై అనుచిత పోస్టుల చేసినందుకు గుంటూరు కొత్తపేట పీఎస్ లో నమోదైన కేసులో ఆయనకు బెయిల్ మంజూరు అయింది....

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి(YCP General Secretary Pudi Srihari)కి హైకోర్టు(High Court)తో పాటు గుంటూరు కోర్టు(Guntur Court)లోనూ ఊరట లభించింది. సీఎం చంద్రబాబు(Cm Chandrababu)పై అనుచిత పోస్టుల చేసినందుకు గుంటూరు కొత్తపేట పీఎస్(Kothapet Ps)లో నమోదైన కేసులో ఆయనకు బెయిల్ మంజూరు అయింది. నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని పోలీసులకు రెండు ధర్మాసనలు సూచించించాయి. దీంతో పూడి శ్రీహరి స్పందించారు. తానెప్పుడూ గీత దాటి ప్రవర్తించలేదన్నారు. ఒకరిపై ద్వేషంతో , మరొకరిపై ఆగ్రహంతో పని చేయలేదని చెప్పారు. ఏప్రిల్ 15న మొదలైన అరెస్ట్ ప్రక్రియ ఇప్పటివరకూ కొనసాగిందన్నారు. తన 48 ఏళ్ల జీవితంలో ఎప్పుడూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కలేదని తెలిపారు. ఇంతవరకూ కోర్టుకు కూడా వెళ్లలేదన్నారు. తనకు మద్దతు ఇచ్చిన వైసీపీ నేతలు, కార్యకర్తలను కృతజ్ఞతలు చెబుతున్నానని పూడి శ్రీహరి పేర్కొన్నారు.






