- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరువూరులో అనైతిక రాజకీయాలు.. జగన్‌కు కంప్లైంట్ చేసిన కౌన్సిలర్లు
తిరువూరు నగర పంచాయతీ ఎన్నికల్లో జరిగిన ఘటనపై పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ వైసీపీ కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు..

దిశ, వెబ్ డెస్క్: తిరువూరు నగర పంచాయతీ ఎన్నికల్లో జరిగిన ఘటనపై పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్(Former CM Jagan)కు వైసీపీ కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. తిరువూరు నగర పంచాయతీ ఛైర్‌పర్సన్ ఎన్నిక(Tiruvuru Nagar Panchayat Chairperson Election) సందర్భంగా తమపై టీడీపీ(Tdp) నాయకుల దాడి చేశారని, దౌర్జన్యానికి పాల్పడ్డారని తెలిపారు. పోలీసులు, కూటమి నేతలు, టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్(MLA Kolikapudi Srinivas) రాజ్యాంగానికి విరుద్దంగా వ్యవహరించారని చెప్పారు. ఈమేరకు కౌన్సిలర్లకు ధైర్యం చెప్పారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని వైఎస్ జగన్ మండిపడ్డారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో మెజారిటీ లేకపోయినా బరితెగించి అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను, దాష్టికాలను దీటుగా ఎదుర్కొందామని, చట్ట ప్రకారం న్యాయ పోరాటం చేద్దామని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ధైర్యంగా పోరాటం చేశారని ప్రశంసించారు.
కాగా తిరువూరు నగర పంచాయతీ ఎన్నికల్లో ఉద్రికత్త చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగింది. పరస్పరం దాడి చేసుకున్నారు. దీంతో ఎన్నిక వాయిదా పడింది. అయితే ఈ సందర్భంగా తలెత్తిన వివాదంపై వైసీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారని మండిపడ్డారు.






