జనసేనలో చేరిన ఆ ముగ్గురు.. కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి

by Gantepaka Srikanth |

అధికారం కోల్పోయి తీవ్ర నిరాశలో ఉన్న వైసీపీ(YCP) నేతలకు వరుస షాక్‌లు తగులుతున్నాయి.

జనసేనలో చేరిన ఆ ముగ్గురు.. కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: అధికారం కోల్పోయి తీవ్ర నిరాశలో ఉన్న వైసీపీ(YCP) నేతలకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే విజయసాయి వంటి అగ్రనేతలు పార్టీని వీడగా.. ఇప్పుడు క్షేత్రస్థాయి లీడర్లు సైతం ఒక్కొక్కరుగా గుడ్ బై చెబుతున్నారు. తాజాగా.. వైసీపీ నుంచి ముగ్గురు కార్పొరేటర్లు జనసేన పార్టీ(Janasena Party)లో చేరారు. వారికి జనసేన పార్టీ కీలక నేత, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) కండువా కప్పి ఆహ్వానించారు. కార్పొరేటర్ల(Corporators) చేరికతో ఇటు జనసేన పార్టీ బలంతో పాటు కూటమి ప్రభుత్వ బలం కూడా పెరుగుతోంది.

ఇదిలా ఉండగా.. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) మేయర్ పీఠం అవిశ్వాస పరీక్షపై ఉత్కంఠ కొనసాగుతోంది. వైసీపీకి గుడ్ బై చెప్పి.. కొందరు కార్పొరేటర్లు జనసేన కండువా కప్పుకోవడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. గాజువాక 74వ డివిజన్ కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి, జీవీఎంసీ 91, 92 డివిజన్ల కార్పొరేటర్లు అయిన కుంచె జ్యోత్స్న, బెహరా స్వర్ణలత శివదేవి జనసేన తీర్థం పుచ్చుకున్నారు.

Next Story