పులివెందులకు జగన్.. మూడు రోజులు అక్కడే మకాం

by Vemula.Srinu Prasad |

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు..

పులివెందులకు జగన్.. మూడు రోజులు అక్కడే మకాం
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy) సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి(Ys Rajasekhar Reddy) వర్ధంతి సందర్భంగా ఆయన సెప్టెంబర్ 1న మధ్యాహ్నం భాకరాపేట క్యాంపు కార్యాలయానికి వెళ్లనున్నారు. సెప్టెంబర్ 2,3 తేదీల్లో పులివెందులలోనే పర్యటించన్నారు. 2న వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత అంబకపల్లి గంగమ్మకుంటవద్ద జలహారతిలో పాల్గొననున్నారు. అనంతరం తిరిగి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకోనున్నారు.

Next Story