ఉంగరాల స్వామి మృతి.. రోడ్డెక్కిన బాధితులు

by Vemula.Srinu Prasad |

తమకు న్యాయం చేయాలంటూ ఉంగరాల స్వామి బాధితులు ఆందోళనకు దిగారు..

ఉంగరాల స్వామి మృతి.. రోడ్డెక్కిన బాధితులు
X

దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా(Annamaiah District) మదనపల్లె(Madanapalle)లో ఘరానా మోసానికి పాల్పడిన ఉంగరాల స్వామి(Ungarala Swamy) మృతి చెందారు. పూజల పేరుతో ప్రజలను ఆయన మోసం చేశారు. సమస్యలు పరిష్కరిస్తానని బంగారు ఆభరణాలు వసూలు చేశారు. ఆ తర్వాత డబ్బు, బంగారం తీసుకుని కుటుంబంతో సహా ఉడాయించారు. అయితే రెండు నెలల క్రితం ఉంగరాల స్వామి మృతిచెందారు. దీంతో బాధితులు లబోదిబోమన్నారు. కుటుంబ ద్వారా అయిన తమ బంగారాన్ని రికవరీ చేసుకోవాలని ప్రయత్నం చేశారు. అయితే ఫలించలేదు. దీంతో బాధితులు తాజాగా నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై ధర్నా నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఉంగరాల స్వామి కటుంబం నుంచి తమ బంగారాన్ని, నగదును రికవరీ చేయాలని కోరుతున్నారు. ఫిర్యాదు చేసి చాలా రోజులు అవుతున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.

Next Story