సీమ వికాసం.. చంద్రబాబుతోనే సాధ్యం..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-15 13:24:43  IST  )

ప్రభుత్వ విధ్వంసకర పాలనతో అంధకారంలోకి వెళ్ళిన రాయలసీమను అభివృద్ధి పథంలో నడిపించడం ఒక్క చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి అన్నారు..

సీమ వికాసం.. చంద్రబాబుతోనే సాధ్యం..!
X

దిశ, కడప: ప్రభుత్వ విధ్వంసకర పాలనతో అంధకారంలోకి వెళ్ళిన రాయలసీమను అభివృద్ధి పథంలో నడిపించడం ఒక్క చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి అన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ అస్తవ్యస్త నిర్ణయాల వల్ల సీమ ప్రాజెక్టులు కుంటుపడి, రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని విమర్శిస్తూ.. ఇప్పుడు వికాస పాలనకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాయలసీమను ఏకంగా రూ. 30,000 కోట్లతో అంతర్జాతీయ స్థాయి ఉద్యానవన హబ్‌గా మార్చేందుకు బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసిందన్నారు . పండ్ల తోటలు, ఉద్యాన పంటల సాగుతో సీమ రైతుల తలరాతను మార్చడమే లక్ష్యంగా ఈ భారీ పెట్టుబడులను వెచ్చించనుంది.

​కడప సాగునీటి ప్రాజెక్టులకు రూ. 982 కోట్ల కేటాయింపు

వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైన కడప జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం ప్రాణం పోస్తోందని . తాజా బడ్జెట్‌లో రూ. 982 కోట్లను ప్రత్యేకంగా కడప జిల్లా ప్రాజెక్టుల నిర్మాణం కోసం కేటాయించడం చంద్రబాబు చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు . గత పాలకులు కేవలం మాటలకే పరిమితమై ప్రాజెక్టులను గాలికి వదిలేయగా, ప్రస్తుత ప్రభుత్వం నిధులను విడుదల చేసి పనులను పరుగులు పెట్టిస్తోంది. ఈ కేటాయింపులతో పెండింగ్‌లో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తయి, జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందుతుందని, తద్వారా సీమలో పచ్చదనం పరుచుకుంటుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేశారు.

తలసేమియా చిన్నారులకు నిరంతర సేవలు.. ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రస్థానంపై సీఎం చంద్రబాబు ఆసక్తికర ట్వీట్

Next Story