Kadapa: ప్రొద్దుటూరులో వ్యక్తి దారుణ హత్య

by Disha Web Desk 16 |
Kadapa: ప్రొద్దుటూరులో వ్యక్తి దారుణ హత్య
X

దిశ, కడప: వైయస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని అమృతనగర్‌లో కురవ రాము (38) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ప్రొద్దుటూరు పట్టణం స్వయంసేవకు రోడ్డు వీధిలో కురవ రాము నివాసం ఉంటున్నారు. అయితే ఆయన తమ్ముడు అమ్మవారికి దేవర నిర్వహిస్తుండడంతో కుటుంబ సభ్యులు, బంధువులంతా అమృతనగర్‌కు వెళ్లారు. అందరితో కలసి మద్యం సేవించిన రాము ఆ తర్వాత కనిపించలేదు. అమృతనగర్‌ సబ్ స్టేషన్ వీధి 18వ లైన్‌లో రక్తపు మడుగులో మృతి చెంది ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Next Story

Most Viewed