కడప జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులతో ముఖాముఖి

by Vemula.Srinu Prasad |

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు...

కడప జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులతో ముఖాముఖి
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Ap Cm Chandrababu Naidu) కడప జిల్లా(Kadapa District)లో పర్యటిస్తున్నారు. పుట్టపర్తి సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో(Puttaparthi Sathya Sai Centenary Celebrations) పాల్గొన్న ఆయన ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే కడప జిల్లా వెల్లటూరు(Vellatur)కు చేరుకున్నారు. ప్రస్తుతం ఆ గ్రామంలో ఎరువుల షాపులను పరిశీలించారు. ప్రస్తుతం రైతులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. రైతుల సమస్యలపై చర్చలు జరుగుతున్నాయి. అనంతరం అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ పథకం ద్వారా 46.86 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ఒక్కొక్కరికి రూ.7 వేల చొప్పున ఖాతాల్లో జమ కానుంది. ఇందుకోసం మొత్తం రూ.3135 కోట్లు విడుదల చేయనున్నారు.

Next Story