Kadapa: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్వో

by Disha Web Desk 16 |
Kadapa: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్వో
X

దిశ,కడప: అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం మాధవరం గ్రామ రెవెన్యూ అధికారి పఠాన్ రహమత్ ఖాన్ (48) ఏసీబీకి చిక్కారు. మహిళ నుంచి రూ.5 వేలు లంచం తీసుకొంటుండగా ఏ.సి.బి అధికారులు రెడ్ హ్యాండ్‌గా పట్టుకున్నారు. మాధవారం గ్రామానికి చెందిన ఓ మహిళ తన వ్యవసాయ భూమిని మ్యూటేషన్, ఆన్‌లైన్, పట్టాదారు పాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేశారు. అయితే ఇవన్నీ చేసేందుకు వీఆర్వో పఠాన్ రహమత్ ఖాన్ రూ.5 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో సీబీఐ అధికారులను ఆమె ఆశ్రయించారు. వలపన్ని మరీ సదరు ఉద్యోగిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా కడప ఏసీబీ డీఎస్పీ కంజాక్షన్ మాట్లాడుతూ ఏదైనా పనుల నిమిత్తం ప్రజలను ప్రభుత్వ అధికారులు, సిబ్బంది లంచం డిమాండ్ చేస్తే వెంటనే టోల్ ఫ్రీ నెంబరు 14400కు ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు. కడప ఏసీబీ కార్యాలయ ల్యాండ్ ఫోన్ నెంబరు 08562 -244637కు గానీ డీఎస్పీ మొబైల్ ఫోన్ నెంబరు 9440446191కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఫిర్యాదు చేసిన వారి పేర్లు, వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. అవినీతి నిరోధించేందుకు ప్రజలు సహకరించాలని డీఎస్పీ కోరారు.



Next Story

Most Viewed