చెట్టును ఢీకొట్టిన ట్రాక్టర్.. ఇద్దరు స్పాట్ డెడ్

by Vemula.Srinu Prasad |

అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది...

చెట్టును ఢీకొట్టిన ట్రాక్టర్.. ఇద్దరు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా(Annamaiah District)లో రోడ్డు ప్రమాదం జరిగింది. చిన్నమండెం మండలం కలిబంద వద్ద అదుపు తప్పి ట్రాక్టర్(Tractor) చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. మృతి చెందిన వారు ఒడిశాకు చెందిన కార్మికులుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story