- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైసీపీ కీలక నిర్ణయం.. నిరసన దీక్షకు రెడీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన దీక్షకు రెడీ అవుతోంది....

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన దీక్షకు రెడీ అవుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. స్టీల్ పరిరక్షణపై ఇవాళ వైసీపీ నేతలు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అఖిలపక్షాన్ని కేంద్రం వద్దకు తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయొద్దని తాము సైతం కోరతామని తెలిపారు. ఇందుకోసం కేంద్రం వద్దకు అన్ని పార్టీలను తీసుకెళ్లే బాధ్యతను కూటమి నాయకులు తీసుకోవాలని సూచించారు. అప్పటి వరకూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం తాము పోరాటం చేస్తామని బొత్స హెచ్చరించారు.
కాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందని గతంలోనే ఆరోపణలు వినిపించాయి. అయితే రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఆందోళనలు నిర్వహించడంతో ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గింది. కానీ ప్లాంట్ నష్టాల్లో ఉండటంతో రూ. 10 వేట్లు కోటాయించి కేంద్రం ఆదుకుంది. దీంతో ప్లాంట్‌లో స్టీల్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్లాంట్ కార్మికులకు పిడుగులాంటి వార్త వినిపించింది. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేకరించేందుకు మరోసారి కేంద్రం ప్రయత్నాలు మొదలు పెట్టిందని తెలిసింది. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యమానికి సిద్ధమవుతోంది. ఈ మేరకు తాజాగా ప్రకటన విడుదల చేసింది.






