Breaking: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే... ఫైనల్ చేసిన సీఎం జగన్

by Disha Web Desk 16 |
Breaking: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే... ఫైనల్ చేసిన సీఎం జగన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను అధిష్టానం ప్రకటించింది. స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. శాసన మండలిలో 18 స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటి స్థానంలో అభ్యర్థులను ఎంపిక చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పెద్దపీట వేస్తూ జాబితా విడుదల చేశారు.

ఎమ్మెల్యే కోటా: బొమ్మి ఇజ్రాయిల్ (తూర్పుగోదావరి), మర్రి రాజశేఖర్ (పల్నాడు జిల్లా), ఏసురత్నం (గుంటూరు జిల్లా), పెన్మత్స సూర్యానారాయణ రాజు (కొనసాగింపు), కోలా గురువులు (విశాఖపట్నం), పోతుల సునీత (ప్రకాశం).

గవర్నర్ కోటా: కర్రి పద్మశ్రీ (కాకినాడ జిల్లా). కుంబా రవిబాబు.

స్థానిక సంస్థల కోటా: నర్తు రామారావు (శ్రీకాకుళం), రామసుబ్బారెడ్డి (కడప), కుడిపూడి సూర్యనారాయణ (తూర్పుగోదావరి), వంకా రవీంద్రనాథ్ (పశ్చిమగోదావరి జిల్లా), కవురు శ్రీనివాస్ (పశ్చిమగోదావరి), ఎస్ మంగమ్మ (అనంతపురం), మేరుగ మురళీధర్ (నెల్లూరు), ఎ. మధుసూదన్ (కర్నూలు), సిపాయి సుబ్రహ్మణ్యం (చిత్తూరు).

కాగా రాష్ట్రంలో సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేసినట్లు తెలిపారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చినట్లు గుర్తు చేశారు. టీడీపీ హయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మండలిలో 37 శాతం ప్రాతినిధ్యం కల్పిస్తే..వైసీపీ ప్రభుత్వం బీసీలకే 43 శాతం ఎమ్మెల్సీ పదవులు ఇచ్చిందని చెప్పారు. మండలిలో బీస్సీ, ఎస్సీ, ఎస్టీలకు 68 శాతం ఎమ్మెల్సీ పదవులు ఇచ్చామని పేర్కొన్నారు.

Also Read...

TTD కీలక నిర్ణయ :ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ అమలు ఎప్పటినుంచి అంటే?


Next Story

Most Viewed