పులివెందుల వస్తున్నానంటే అమ్మ భయపడుతుంది...వైఎస్ సునీత ఆవేదన

by Ajay Maddhiboyina |

రేపు తన తండ్రి వివేకా పుట్టినరోజు సందర్భంగా పులివెందుల వెళుతుంటే తన తల్లి బయపడుతోందని వైఎస్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు.

పులివెందుల వస్తున్నానంటే అమ్మ భయపడుతుంది...వైఎస్ సునీత ఆవేదన
X

దిశ‌, వెబ్ డెస్క్: రేపు తన తండ్రి వివేకా పుట్టినరోజు సందర్భంగా పులివెందుల వెళుతుంటే తన తల్లి బయపడుతోందని వైఎస్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. అంద‌రూ నేర‌స్థులే అని కానీ అంద‌రూ బ‌య‌ట‌నే ఉంటారు తిరుగుతార‌ని వ్యాఖ్యానించారు. న్యాయం కోసం కొట్లాడుతూ ఎందుకు భ‌య‌ప‌డాలి అని ప్ర‌శ్నించారు. త‌ప్పు చేసిన‌వాళ్లు జైలులో ఉంటే ఎందుకు భ‌య‌ప‌డ‌తామ‌ని ప్ర‌శ్నించారు.

అనుమానితులే కానీ అంద‌రూ బ‌య‌టే ఉంటార‌న్నారు. ఇది న్యాయ‌మా అని ప్ర‌శ్నించారు. ఇంకా ఎన్ని రోజులు పోరాడాల‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. క‌డ‌ప‌లో, పులివెందుల‌లో ప్ర‌శాంతంగా బ‌తకాలంటే ఎలా అని ఎస్పీని ప్ర‌శ్నించాన‌ని, ఇంకా ఎంత‌కాలం అని అన్నారు. న్యాయం కోసం పోరాడేందుకు సెక్యురిటీ పెట్టుకుని తిర‌గాలా అని ప్ర‌శ్నించారు. ఏదో ఒక‌రోజు క‌చ్చితంగా న్యాయం జ‌రుగుతుందని అన్నారు. ప్ర‌తిఒక్క‌రూ స‌పోర్ట్ చేస్తార‌ని ఆశిస్తున్నాన‌ని చెప్పారు.

Next Story