పవన్, జగన్‌తో పాటు ఆ ఇద్దరు కూడా మద్దతివ్వాలి.. వైఎస్ షర్మిల రిక్వెస్ట్

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-19 15:02:45  IST  )

ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి(Justice B.Sudarshan Reddy) పేరు ప్రకటించడం తెలుగు ప్రజలకు గర్వకారణం అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) హర్షం వ్యక్తం చేశారు.

పవన్, జగన్‌తో పాటు ఆ ఇద్దరు కూడా మద్దతివ్వాలి.. వైఎస్ షర్మిల రిక్వెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి(Justice B.Sudarshan Reddy) పేరు ప్రకటించడం తెలుగు ప్రజలకు గర్వకారణం అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు. ‘పార్టీలు, రాజకీయాలను పక్కన పెట్టి న్యాయ నిపుణుడికి INDIA కూటమి అవకాశం ఇవ్వడం హర్షణీయం. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి. దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతున్న ఈ సమయంలో సుదర్శన్ రెడ్డి లాంటి న్యాయరంగ నిపుణులు ఉప రాష్ట్రపతి పదవిలో ఉంటేనే రాజ్యాంగం పరిరక్షించ బడుతుందని INDIA కూటమి బలంగా నమ్ముతుంది.

INDIA కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి ప్రకటన తెలుగు వారికి దక్కిన గౌరవం. రాజకీయాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు ఏకం కావాల్సిన సందర్భం ఇది. తెలుగు బిడ్డకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనే సమయం ఇది. సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాదు. ఆయనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. ఆయన ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్. సుదర్శన్ రెడ్డిని తెలుగు బిడ్డగా పరిగనణలోకి తీసుకుని, న్యాయరంగంలో ఆయన చేసిన విశేష సేవలను గుర్తు చేసుకుంటూ, రాజకీయాలు ఆపాదించకుండా టీడీపీ, జనసేన, వైసీపీ, బీఆర్ఎస్‌లు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరుతున్నా. ఇందుకు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని ఎక్స్ వేదికగా షర్మిల డిమాండ్ చేశారు.

Next Story