- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నా’.. సీఎం రేవంత్ ముందు షర్మిల కీలక డిమాండ్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి నేడు.

దిశ,వెబ్‌డెస్క్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి నేడు. ఈ తరుణంలో ఇవాళ(జులై 8) మహానేత 76 వ జయంతి సందర్భంగా ఏపీసీసీ వైఎస్ షర్మిల(YS Sharmila) ఘన నివాళులు అర్పించారు. ఈ క్రమంలో YSR ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రెండు సార్లు పని చేశారు. రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో YSR కీలకం పరిపాలన, పథకాలతో కోట్ల మందికి అండగా ఉన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్, జలయజ్ఞం లాంటి పథకాలు. YSR మార్క్ మాట తప్పక పోవడం, మడమ తిప్పకపోవడం YSR నైజమని వైఎస్ షర్మిల తెలిపారు.
YSR చనిపోతే ఆయన వెనకాలే 700 మంది ప్రాణాలు వదిలారు. ఈ సందర్భంగా ఆయన(YSR) కూతురు, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ(Telangana) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి కీలక విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో AICC అగ్రనేత సోనియా గాంధీ, రాహుల్ కి లేఖలు రాశా అని తెలిపారు. ఈ క్రమంలో వైఎస్సార్ చనిపోయి ఇన్ని ఏళ్ళవుతున్నా హైదరాబాద్(Hyderabad)లో ఆయనకు మెమోరియల్ ఘాట్ లేకుండా పోయింది. అందుకే వైఎస్ఆర్ జ్ఞాపకార్థం హైదరాబాద్‌లో స్మృతి వనం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ ను కోరారు. ఈ విషయం పై సీఎం రేవంత్ అన్న సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాను అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.






