‘నా కళ్ళతో ఆయనను చూశా’.. YS షర్మిల ఆసక్తికర ట్వీట్

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-30 12:04:07  IST  )

వైఎస్ రాజారెడ్డి(YS Raja Reddy) 100వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) ఆసక్తికర ట్వీట్ పెట్టారు.

‘నా కళ్ళతో ఆయనను చూశా’.. YS షర్మిల ఆసక్తికర ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్ రాజారెడ్డి(YS Raja Reddy) 100వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) ఆసక్తికర ట్వీట్ పెట్టారు. వైఎస్ రాజారెడ్డి మా కుటుంబంలో మహోన్నత వ్యక్తి. యెడుగూరి సందింటి వంశానికి శక్తి, మూలస్థంభం రెండూ ఆయనే. మా నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhara Reddy)ని ప్రజా నాయకుడిగా, రాజకీయాల్లోనే దిగ్గజంగా తీర్చిదిద్దిన వ్యక్తి రాజారెడ్డి. అసమానమైన ధైర్య సాహసాలకు రాజారెడ్డి పెట్టింది పేరు. దృఢమైన విలువలతో తన ప్రజలకు ఆపదలో అండగా నిలిచారు. నా కళ్ళతో నేను ఆయనను చూశా. ఓర్పు మరియు ధైర్యం రాజారెడ్డి ఆయుధాలు. ప్రజల సమస్యలను వినడం, వాటిని పరిష్కరించడంలో నిక్కచ్చిగా నిలవడమే ఆయన తత్వం. రాజారెడ్డి ప్రజా నాయకుడు. ప్రజల ఆరోగ్యం బాగుండాలని ఆసుపత్రి కట్టించారు. బిడ్డలు పెద్ద చదువులు చదవాలని డిగ్రీ కాలేజీ, మహిళా కళాశాల, పాలిటెక్నిక్ కాలేజీ లాంటి విద్యాసంస్థలు కట్టించారు. ప్రజల మనిషిగా, ప్రజల గుండెలో శాశ్వత స్థానం సంపాదించే ఆయన వారసత్వం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఆయన ధైర్యం, క్రమశిక్షణ, న్యాయం పట్ల నిబద్ధత లాంటి అంశాలు ప్రజా సేవలో మా భవిష్యత్‌ను కూడా తీర్చిదిద్దాయి. రాజారెడ్డి చేసిన సేవ, అంకితభావం తరతరాలకు స్పూర్తిగా నిలుస్తుందని గర్వంగా చెబుతున్నాను’ అని షర్మిల ట్వీట్‌లో పేర్కొన్నారు.

Next Story