- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం(Telangana Formation Day) సందర్భంగా ఏపీపీసీసీ వైఎస్ షర్మిల(YS Sharmila) తెలంగాణ(Telangana) ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం(Telangana Formation Day) సందర్భంగా ఏపీపీసీసీ వైఎస్ షర్మిల(YS Sharmila) తెలంగాణ(Telangana) ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. రాష్ట్రాలుగా వేరైనా తెలుగు ప్రజలు అందరం ఒక్కటే అని ఆమె తేల్చి చెప్పారు. రాష్ట్రంలో నియంత పాలనకు, బానిసత్వానికి స్వస్తి చెప్పి, నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా పాలన అందిస్తూందని తెలిపారు. హస్తమే అభయహస్తంగా "తెలంగాణ రైజింగ్" నినాదంతో అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతూ, అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka), ఇతర కేబినెట్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, పార్టీ నేతలకు వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.






