- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్ని కుక్కలు మొరిగినా నా కొడుకు వైఎస్ వారసుడే.. YS షర్మిల ఘాటు వ్యాఖ్యలు
కొడుకు వైఎస్ రాజారెడ్డి(Raja Reddy) రాజకీయ అరంగేట్రంపై వైఎస్ షర్మిల(YS Sharmila) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కొడుకు వైఎస్ రాజారెడ్డి(Raja Reddy) రాజకీయ అరంగేట్రంపై వైఎస్ షర్మిల(YS Sharmila) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. ‘నా కొడుకు ఇంకా రాజకీయాల్లోకి అడుగే పెట్టలేదు. అప్పుడే వైసీపీకి భయమెందుకు మొదలైందో తెలియడం లేదు. నా కుమారుడికి రాజారెడ్డి పేరుపెట్టిందే నా తండ్రి రాజశేఖర్ రెడ్డి. ఎన్ని కుక్కలు మొరిగినా నా కొడుకు బరాబర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhar Reddy) వారసుడే’ అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇదిలా ఉంటే వైఎస్ రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా?.. తల్లికి అండగా ఉండేందుకు రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారా?.. అని సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇందుకు షర్మిల ఇవాళ వెంట కర్నూలు ఉల్లి మార్కెట్‌కు రాజారెడ్డి రావడమే కారణం. అంతేకాదు.. ఇంటి దగ్గర అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే రాజారెడ్డి కర్నూలు ఉల్లి మార్కెట్‌కు వచ్చారనే చర్చ జరుగుతోంది. వైఎస్ షర్మిల తనయుడు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఖాయమంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో కచ్చితంగా అవసరం అయిననప్పుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తారంటూ షర్మిల క్లారిటీ ఇచ్చారు.






