Ap Politics:సీఎం జగన్ పై విమర్శలు గుప్పించిన వైఎస్ షర్మిల

by Disha Web Desk 18 |
Ap Politics:సీఎం జగన్ పై విమర్శలు గుప్పించిన వైఎస్ షర్మిల
X

దిశ,కమలాపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుంభకర్ణుడు, నాలుగున్నర ఏళ్లు నిద్ర పోయి ఎన్నికలకు ఆరు నెలల ముందు నిద్ర లేచాడని ఏపీసీసీ అధ్యక్షురాలు, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి తీవ్రంగా విమర్శించారు.షర్మిల ఏపీ న్యాయ యాత్ర ఆదివారంతో మూడో రోజుకు చేరుకుంది. షర్మిల మేనమామ పి.రవీంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కమలాపురంలో ఏపీ న్యాయ యాత్ర కొనసాగింది. యాత్ర మొదలైనప్పటి నుంచి షర్మిల తన అన్న జగన్మోహన్ రెడ్డి, తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు.

ప్రతిపక్షం పై విమర్శలు చేయకుండా అధికారపక్షం విమర్శలు ఎక్కు పెట్టారు.నియోజకవర్గంలోని పెండ్లిమర్రి మండలం యాదవపూరంలో చిన్న సుబ్బరాయుడు కుటుంబాన్ని షర్మిల ఓదార్చారు. సుబ్బరాయుడు కుమారుడు శ్రీనివాస్ యాదవ్ ఈ నెల 2వ తేదీన ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యాడు.అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ యాదవపురం గ్రామంలో హత్యకు గురైన శ్రీనివాస్ యాదవ్ కుటుంబాన్ని పరామర్శించారు. వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులు రాళ్లతో కొట్టి హత్య చేశారని ఆరోపించారు. వాళ్ల తమ్ముడిని ట్రాక్టర్ తో తొక్కించాలని చూశారన్నారు. నిందితులను కాపాడే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారన్నారు.

తమ్ముడిని చంపాలని చూసిన వాళ్ల పై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్ రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులే అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులకు దిక్కు లేదన్నారు. కడప స్టీల్ వైఎస్సార్ కల, కడప స్టీల్ పూర్తి అయ్యి ఉంటే 25 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేవారు. శంకుస్థాపనలు చేశారు తప్పిస్తే ప్రాజెక్టు ముందుకు కదలేదన్నారు. వివేకా హత్య జరిగి ఐదు ఏళ్లు అయ్యిందని, హత్య చేసిన వాళ్లు యధేచ్చగా బయట తిరుగుతున్నారన్నారు. అధికారం అడ్డం పెట్టుకొని దర్జాగా తిరుగుతున్నారన్నారని మండిపడ్డారు.

Read More..

Breaking:ఏపీలో ఎక్కడ చూసిన హత్యలే..జగన్ పై షర్మిల ఫైర్


Next Story

Most Viewed