- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అరెస్ట్
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అరెస్ట్ అయ్యారు. పోలీసులు గన్నవరంలోని ఆమె నివాసంలో షర్మిలను అదుపులోకి తీసుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అరెస్ట్ అయ్యారు. పోలీసులు గన్నవరంలోని ఆమె నివాసంలో షర్మిలను అదుపులోకి తీసుకున్నారు. షర్మిల ఉద్దండరాయుని పాలెం పర్యటనకు బయలుదేరడంతో పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. షర్మిల నివాసం వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించినట్టు సమాచారం. మరో రెండు రోజుల్లో మోడీ అమరావతి పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మోడీ అమరావతిలో శంకుస్థాపన చేసిన ప్రాంతానికి షర్మిల బయలుదేరగా అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అమరావతి పరిస్థితి ఎలా ఉంది అనేదానిపై కాంగ్రెస్ ఓ కమిటీ వేయాలని నిర్ణయించింది. ఈ కమిటీలోని సభ్యులతో షర్మిల ఉద్దండరాయపాలెం వెళ్లేందుకు సిద్ధపడ్డారు. అక్కడ పర్యటించి మెడీని ప్రశ్నించాల్సిన అంశాల గురించి నివేధిక తయారు చేసుకోవాలని కమిటీ భావించినట్టు తెలుస్తోంది. కానీ ఉద్దండరాయపాలెం వద్ద మోడీ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు జరుగుతుండటంతో పోలీసులు కమిటీ సభ్యులను అడ్డుకున్నట్టు తెలుస్తోంది.






