- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘రాజకీయ కక్షలతో దాడులు’.. ప్రభుత్వం పై వైఎస్ జగన్ ఆగ్రహం
సీఎం చంద్రబాబు పై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

దిశ,వెబ్‌డెస్క్: గురజాల నియోజకవర్గానికి చెందిన వైసీపీ కార్యకర్త సాల్మన్ హత్యపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కక్షలతో ఎన్ని అరాచకాలు సృష్టిస్తారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. “చంద్రబాబు... మీరు పాలించడానికి అర్హులేనా? రాజకీయ కక్షలతో ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటారు? ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా రెడ్‌బుక్ రాజ్యాంగం, రాజకీయ పాలన ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడతారా? మా పార్టీ కార్యకర్త, ఒక దళితుడు, ఒక పేదవాడు అయిన మందా సాల్మన్ హత్యకు గురైన ఘటనపై మీరు ఏం సమాధానం చెప్తారు? ” అంటూ వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనారోగ్యంతో ఉన్న భార్యను చూడటానికి సొంత గ్రామానికి వచ్చిన సాల్మన్‌ను ఇనుప రాడ్లతో కొట్టి హత్య చేయడం అమానుషం అన్నారు. ఈ ఘటన పూర్తిగా వైసీపీ కార్యకర్తలను భయపెట్టేందుకు అధికార పార్టీ నేతలు, కొంతమంది పోలీసులు కలిసి చేస్తున్న కుట్రేనని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, తమకు నచ్చని వారిని బెదిరించడం, హత్యా రాజకీయాలకు పాల్పడటం వల్లే పిన్నెల్లి గ్రామం నుంచి వందలాది వైసీపీ కార్యకర్తల కుటుంబాలు ప్రాణభయంతో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయాయని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి పల్నాడు జిల్లా సహా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు.
పౌరులకు రక్షణ కల్పించడం, వారు స్వేచ్ఛగా జీవించేలా చూడటం ప్రభుత్వ బాధ్యత కాదా? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఆ బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమవడం మాత్రమే కాకుండా, కక్షల కోసం శాంతిభద్రతల(Law and order)ను దెబ్బతీస్తూ హత్యా రాజకీయాలకు వెన్నుదన్నుగా నిలవడం ఘోరమైన నేరమని అన్నారు. ఇది స్పష్టమైన రాజ్యాంగ ఉల్లంఘన అని పేర్కొంటూ, హింసా రాజకీయాలకు పాల్పడుతున్న వారిని ప్రజలు ఎప్పటికీ క్షమించరని, తప్పకుండా మూల్యం చెల్లించాల్సి వస్తుందని మాజీ సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు. సాల్మన్ కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.






