- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్నీ శుభాలు కలగాలి: తెలుగు ప్రజలకు జగన్ ఉగాది శుభాకాంక్షలు
తెలుగుప్రజలకు వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు..

X
దిశ, వెబ్ డెస్క్: తెలుగుప్రజలకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్(YSRCP chief and former CM YS Jagan) ఉగాది(Ugadi) శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఉగాది పండగను వైభవంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలకు అన్నీ శుభాలు కలగాలని జగన్ కోరుకున్నారు. షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శ్రీ విశ్వావసు సంవత్సరంలో ప్రతి ఇంట్లో ఆయురోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని ఆక్షాంక్షించారు. రాష్ట్రం సర్వతో ముఖి సుబిక్షంగా ఉండాలని, పల్లెలు, పట్టణాలు కళకళలాడాలని, తెలుగు సంస్కృతీ సంప్రదాయలు కలకాలం వర్ధిలాలన్నారు. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ సంప్రదాయబద్ధంగా ఉగాది పండగను జరుపుకోవాలని జగన్ ట్వీట్ చేశారు.
Next Story






