నేడు, రేపు కడప జిల్లాలో జగన్ పర్యటన

by Naga Rani Yarlagadda |

వైఎస్ జగన్ నేడు బెంగళూరు నుంచి ఇడుపులపాయకు వెళ్లనున్నారు. రెండ్రోజులపాటు ఆయన జిల్లాలో పర్యటించనున్నారు.

నేడు, రేపు కడప జిల్లాలో జగన్ పర్యటన
X

దిశ, వెబ్ డెస్క్: నేడు, రేపు కడప జిల్లాలో జగన్ పర్యటనఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ (YSRCP) అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) నేడు, రేపు.. రెండ్రోజులపాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. బెంగళూరు నుంచి ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో ఇడుపులపాయ(Idupulapaya)కు వెళ్లనున్నారు. అక్కడ జిల్లా పార్టీ నేతలతో సమావేశమై.. కీలక విషయాలపై చర్చించనున్నారు. అక్కడి నుంచి పులివెందుల (Pulivendula) లోని నివాసానికి చేరుకుంటారు. ఇటీవలే మరణించిన బాబాయ్ మనోహర్ రెడ్డి అత్తగారి కుటుంబాన్ని జగన్ పరామర్శి్స్తారు.

ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన వైఎస్సార్సీపీ.. క్రమంగా బలహీన పడుతోంది. ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ.. తన ఉనికిని కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ.. షర్మిల - జగన్ ల మధ్య జరుగుతున్న ఆస్తిపంపకాల గొడవలు.. పార్టీ పై ప్రభావం చూపుతున్నాయి. పార్టీని బలోపేతం చేయాలని ఎంత ప్రయత్నించినా.. ఫలితం మాత్రం అంతంతమాత్రంగా కూడా ఉండటం లేదని టాక్ వినిపిస్తోంది.

Next Story