జ్వరంతో బాధపడుతున్న వైయస్ జగన్

by Thanuru Gopichand |

వైసీపీ అధినేత.. మాజీ సీఎం వైయస్ జగన్ (YS Jagan) పులివెందుల రెండో రోజు పర్యటన తాత్కాలికంగా వాయిదా పడినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

జ్వరంతో బాధపడుతున్న వైయస్ జగన్
X

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ అధినేత.. మాజీ సీఎం వైయస్ జగన్ (YS Jagan) పులివెందుల రెండో రోజు పర్యటన తాత్కాలికంగా వాయిదా పడినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం వైయస్ జగన్ జ్వరంతో బాధపడుతున్నారని పార్టీ అధికారిక ఎక్స్ హ్యాండిల్ లో వెల్లడించింది. దీంతో నేడు పులివెందులలో జరగాల్సిన రెండో పర్యటన వాయిదా పడింది. జగన్ కు తగిన విశ్రాంతి కావాలని వైద్యులు సూచించారని సమాచారం. అందుకే నేటి కార్యక్రమాలను ఆయన రద్దు చేసుకున్నారని తెలుస్తోంది. తొలిరోజు షెడ్యూల్ అయిన మంగళవారం భాకరాపురం క్యాంప్ ఆఫీసులో ప్రజాదర్బార్ (Praja Darbar) ను వైయస్ జగన్ నిర్వహించారు. పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడకు తరలివచ్చి తమ గోడును వెల్లబోసుకున్నారు. తామెదుర్కొంటున్న సమస్యలను జగన్ కు వివరించారు. వారందరినీ దగ్గకు తీసుకొని జగన్ ధైర్యాన్ని ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

అయితే రెండో రోజైన బుధవారం పర్యటన జ్వరం కారణంగా ఆకస్మికంగా నిలిచిపోయింది. ఈ షెడ్యూల్లో భాగంగా ఉదయం 10.30 గంటలకు పులివెందుల నుంచి ఇడుపులపాయ చేరుకోవాల్సింది. అక్కడ ప్రేయర్ హాల్లో జరిగే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనాల్లో జగన్ పాల్గొనాల్సి ఉంది. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు పులివెందుకు తిరుగు ప్రయాణమైన భాకరాపురం క్యాంప్ ఆఫీసులో ప్రజాదర్బార్ నిర్వహించి అక్కడే బస చేయాల్సి ఉంది. అయితే అనారోగ్య కారణంగా వాటన్నింటినీ వైయస్ జగన్ వాయిదా వేసుకున్నారు. దీంతో పార్టీ శ్రేణుల్లో కొంత నిరుత్సాహం నెలకొంది. అయితే ఆరోగ్యం కుదుటపడగానే ఆయన పర్యటనను కొనసాగిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Next Story