- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి.. హిందూపురం ఘటనను ఖండించిన వైఎస్ జగన్
హిందూపురంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంపై టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అనుచరులు చేసిన హింసాత్మక దాడి..

దిశ, వెబ్‌డెస్క్: హిందూపురంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంపై టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అనుచరులు చేసిన హింసాత్మక దాడి.. ప్రజాస్వామ్యంపైనే చేసిన ప్రత్యక్ష దాడి అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ అనాగరిక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎక్స్(X)లో ట్వీట్ చేశారు. రాజకీయ పార్టీలకు చెందిన కార్యాలయాలను ధ్వంసం చేయడం, ఫర్నిచర్ ను విరగ్గొట్టడం, అద్దాలను పగల గొట్టడమే కాకుండా.. కార్యకర్తలపై కూడా దాడి చేయడం హేయమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు స్పందించకుండా మిన్నకుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుందన్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు పోలీస్ యంత్రాంగాన్ని రాజకీయ ఎజెండా కోసం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. హిందూపురం ఘటన.. టీడీపీ అధినాయకత్వం హింసను ఎలా ప్రోత్సహిస్తుందో చెప్పేందుకు ఉదాహరణగా కనిపిస్తోందన్నారు. తన ప్రత్యర్థుల ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కులను కాపాడలేని ప్రభుత్వానికి పాలన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఘాటు విమర్శలు చేశారు. ఈ దాడి కేవలం వైసీపీపై మాత్రమే జరిగినది కాదని.. ప్రజాస్వామ్యం, రాజకీయ స్వేచ్ఛను విశ్వసించే ప్రతి పౌరుడిపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యాన్ని తొక్కివేసేలా జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్వీట్ లో ప్రకటించారు.






