దారుణం.. కన్నెత్తి చూడలేదు.. ఆసరాలేదు: వైఎస్ జగన్ తీవ్ర ఆందోళన

by Vemula.Srinu Prasad |

రికార్డు స్థాయిలో పంటల ధరలు దారుణంగా పతనమైనా రైతులవైపు ప్రభుత్వం కన్నెత్తిచూడటంలేదని వైఎస్ జగన్ అన్నారు...

దారుణం.. కన్నెత్తి చూడలేదు.. ఆసరాలేదు: వైఎస్ జగన్ తీవ్ర ఆందోళన
X

దిశ, వెబ్ డెస్క్: రికార్డు స్థాయిలో పంటల ధరలు దారుణంగా పతనమైనా రైతులవైపు ప్రభుత్వం కన్నెత్తిచూడటంలేదని వైఎస్ జగన్ అన్నారు. పంట నష్టపోయిన రైతుల పరిస్థితిపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ప్రభుత్వం కారణంగా నెలకొన్న దారుణమైన పరిస్థితులను తట్టుకోలేక, ఏమాత్రం ఆసరాలేక రైతులు తాము వేసిన పంటలను తామే ట్రాక్టర్లతో దున్నివేసే పరిస్థితులు తీసుకువచ్చారని ఆయన ఆరోపించారు. దుర్మార్గ పాలనతో రైతుల ఒంటిమీద ఉన్న చొక్కాను కూడా తీసివేసి వారిని రోడ్డుమీద నిలబెట్టి, ఇప్పుడు మళ్లీ వారి కాలర్ ఎగరేసుకునేలా చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. రైతులకు ఎండమావులు చూపిస్తారా?, కష్టాలు, బాధలు కనిపించనీయకుండా, దీనిమీద చర్చ జరగకుండా వాటికి ముసుగు వేస్తున్నారని ధ్వజమెత్తారు. అసలు ఈ 18 నెలల కాలంలో రైతులకోసం ప్రభుత్వం ఎప్పుడు నిలబడిందని ప్రశ్నించారు. ఈ సంక్షోభానికి రైతులే కారణమన్నట్టుగా వారి మెదళ్లపై దాడిచేయడానికే ప్రభుత్వం ఎంచుకున్న ఎత్తుగడ కాదా ఇది అని జగన్ నిలదీశారు. ‘‘మూడు విమానాలు, ఆరు హెలికాప్టర్లు, విదేశీ పర్యటనలు, వీకెండ్‌ హైదరాబాద్‌ యాత్రలతో కోట్లాదిరూపాయలు తగలేస్తున్నారు కాని, రైతులను ఆదుకోవడానికి మాత్రం మనసు రాదా?’’. అని జగన్ వ్యాఖ్యానించారు.

జగన్ ట్వీట్...

Next Story