- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాబూ జగ్జీవన్ రామ్ వర్థంతి.. నివాళులు అర్పించిన జగన్
అణగారిన వర్గాల అభివృద్ధి కోసం అలుపెరుగని కృషి చేసిన మహనీయుడు, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారు.

దిశ, వెబ్‌డెస్క్: మాజీ ఉప ప్రధాని డాక్టర్ జగ్జీవన్ రామ్ (babu jagjivan ram) వర్ధంతి సందర్భంగా.. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) నివాళులు అర్పించారు. బాబూ జగ్జీవన్ రామ్ ను స్మరించుకుంటూ ఆయన ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.
"అణగారిన వర్గాల అభివృద్ధి కోసం అలుపెరుగని కృషి చేసిన మహనీయుడు, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారు. స్వాతంత్ర్య సమర యోధుడిగా, సంఘసంస్కర్తగా రాజకీయ నాయకుడిగా దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు బాబూ జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు." అని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు.
అలాగే నేడు తొలి ఏకాదశి, మొహరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. "రాష్ట్ర ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ ఆషాడ శుద్ధ ఏకాదశిని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా." "దయ, కరుణ, శాంతికి ప్రతీక మొహర్రం. ముహమ్మద్ ప్రవక్త మనవడు హజరత్ ఇమామ్ హుస్సేన్ అలైహిస్సలాం బలిదానానికి గుర్తుగా నిర్వహించుకునే ఈ మొహర్రంను ముస్లిం సోదర సోదరీమణులు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా." అని పోస్టుల్లో పేర్కొన్నారు.






