జగన్! ఓ ఐరన్ లెగ్..ఆయన ఎక్కడుంటే కరవు అక్కడే: నారా లోకేశ్

by Seetharam |

ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కరవు కవల పిల్లలు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సెటైర్లు వేశారు.

జగన్! ఓ ఐరన్ లెగ్..ఆయన ఎక్కడుంటే కరవు అక్కడే: నారా లోకేశ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కరవు కవల పిల్లలు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సెటైర్లు వేశారు. రాష్ట్రంలో కరవు విలయతాండవం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శలు చేశారు. వైఎస్ జగన్ ఎక్కడుంటే కరవు అక్కడుంటుందని నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ విధానాలపై రైతులు విసుగెత్తిపోయారని త్వరలోనే జగన్ పని అయిపోతుందంటూ హెచ్చరించారు. ఐరన్ లెగ్ జగన్‌ను రాష్ట్రమంతా ద్వేషిస్తోందని లోకేశ్ చెప్పుకొచ్చారు. ఈ మేరకు లోకేశ్ ట్వీట్ చేశారు. ఇకపోతే విద్యార్థులకు ప్రభుత్వ బకాయిలను తక్షణమే విడుదల చేయాలంటూ సీఎం జగన్‌కు నారా లోకేశ్ గురువారం లేఖ రాసిన సంగతి తెలిసిందే.

Next Story