అసెంబ్లీ సమావేశాలకు దూరంగా వైసీపీ

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-12 13:52:08  IST  )

రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మరోసారి కూడా హాజరుకాకూడదని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు...

అసెంబ్లీ సమావేశాలకు దూరంగా వైసీపీ
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల(Assembly Meetings)కు దూరంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party) ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) దిశానిర్దేశం చేశారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వనందున అసెంబ్లీకి హాజరుకావొద్దని, శాసనమండలికి యథావిధిగా వెళ్లాలని జగన్ సూచించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో భవిష్యత్తు కార్యచరణపై చర్చించారు.

అందుకే హోదా కావాలి


హోదా కోసం ప్రజల సమస్యలపై చర్చించేందుకు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నామని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి(Mlc Lella Appireddy) తెలిపారు. ప్రజా సమస్యలను ప్రశ్నించకుండా తమ నేతల గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. క్యాష్, రాజేశ్, సూట్ కేస్, లోకేశ్ మాత్రమే రాష్ట్రంలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఓ వైపు కూటమి, మరోవైపు వైసీపీ మాత్రమే ఉన్నాయని, అందుకే తాము ప్రతిపక్ష హోదా అడుగుతున్నామని లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు.

Next Story