నేడు YS జగన్ కీలక సమావేశం... కారణం ఇదే

by velandi.Saikiran |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ( Ys jagan) ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

నేడు YS జగన్ కీలక సమావేశం... కారణం ఇదే
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ( Ys jagan) ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఏపీలో వైసీపీ పార్టీ అధికారం కోల్పోవడం, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలు మాత్రమే రావడం, కీలక నేతలందరూ పార్టీని వీడి కూటమిలోకి వెళ్లడం ఇలా వరుసగా... జరగడంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి కాస్త డీలా పడ్డారు. అయితే ఈ నేపథ్యంలో.. వైయస్ జగన్మోహన్ రెడ్డి మెడకు సింగయ్య ( Singaiah) సంఘటన కూడా చుట్టుకుంది.

జగన్మోహన్ రెడ్డి ( Jagan) సత్తెనపల్లి పర్యటన నేపథ్యంలో... కారు కింద పడి సింగయ్య మృతి చెందాడు. ఈ సంఘటనలో జగన్మోహన్ రెడ్డి పై కేసు నమోదు అయింది. అయితే ఈ నేపథ్యంలో.. జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ అత్యవసరంగా సమావేశం నిర్వహించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైసీపీ ఎమ్మెల్యేలు, సీనియర్ లీడర్లు, రాజ్యసభ సభ్యులు, ఇలా అందరితో ఇవాళ అత్యవసరంగా జగన్మోహన్ రెడ్డి సమావేశం కాబోతున్నారు.

ఈ సందర్భంగా సింగయ్య సంఘటన, ఏపీలో ఉన్న పరిస్థితులపై చర్చించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి ఏడాది కాలం అయింది. కూటమి ఏడాది కాలంలో జరిగిన వైఫల్యాలను జనాల్లోకి తీసుకువెళ్లేలా నేతలకు దిశా నిర్దేశం చేయబోతున్నారు. వైసిపికి మళ్లీ పూర్వ వైభవం తీసుకువచ్చేలా నేతలకు కీలక ఆదేశాలు జారీ చేయనున్నారు.

Next Story