‘వైఎస్ జగన్‌కు ప్రజాస్వామ్యంలో ఉండే అర్హత లేదు’.. మంత్రి నిమ్మల సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-07-27 13:04:05  IST  )

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు.

‘వైఎస్ జగన్‌కు ప్రజాస్వామ్యంలో ఉండే అర్హత లేదు’.. మంత్రి నిమ్మల సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. గత ఐదేళ్ల పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని మంత్రి ఆరోపించారు. ఈ క్రమంలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 సీట్లు వచ్చాయని తెలిపారు. రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలని సీఎం చంద్రబాబు పని చేస్తుంటే, వైసీపీ నేతలు తీరు మార్చుకోకుండా విధ్వంసం చేసేలా రెచ్చగొడుతున్నారని అన్నారు.

మానవత్వం లేని జగన్‌కు ప్రజాస్వామ్యం లో ఉండే అర్హత లేదని పేర్కొన్నారు. తలరాతలను మార్చే చంద్రబాబు కావాలో, తలకాయలు తొక్కించుకుంటూ వెళ్లే జగన్ కావాలో ప్రజలు తేల్చుకోవాలని అన్నారు. జగన్ అధికారంలోకి ఉన్న 5 ఏళ్ళు ఒక్క టీచర్ పోస్టుల భర్తీ చేయలేదని, కూటమి ప్రభుత్వం 16 వేలకు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేస్తుందని తెలిపారు. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకు తల్లికి వందనం అందించామని అన్నారు. రైతులకు 20 వేల రూపాయలు ఆర్ధిక సాయం అందించబోతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తోందని మంత్రి నిమ్మల తెలిపారు.

Next Story