- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బస్ కండక్టర్ పై యువకుల దాడి.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వీడియో
రాజంపేట డిపో బస్ కండక్టర్ పై యువకులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: రాజంపేట డిపో (Rajampeta Bus Depot) బస్ కండక్టర్ (Bus Conductor) పై యువకులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో (Video) నెట్టింట చక్కర్లు కొడుతోంది. రాజంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కడపకు (Rajam Peta To Kadapa) వెళుతోండగా.. నందలూరు (Nandaluru) వద్దకు రాగానే కొందరు యువకులు బస్ ను ఆపారు. బస్సులోకి ఎక్కి కండక్టర్ పై దాడికి దిగారు. వీరిలో ఓ యువకుడు బస్సు కిటికీ మీదకు ఎక్కి కండక్టర్ ను దుర్భాషలాడుతూ.. గొంతు నులిమాడు.
మరి కొందరు యువకులు బస్సులోకి ఎక్కి కండక్టర్ పై దాడి చేశారు. డ్రైవర్ దాడి చేయవద్దని వేడుకుంటున్నా వినకుండా చెయ్యి చేసుకున్నారు. డ్రైవర్ ను కూడా బెదిరింపులకు గురి చేశాడు. ఈ సంఘటనను ఓ వ్యక్తి చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నారు. అలాగే దాడి చేసిన యువకులపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అంతేగాక విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేయడం నేరం అని, దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కామెంట్ల ద్వారా కోరుకుంటున్నారు.






