- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP : నిన్న వంశీ..రేపు కొడాలి నాని ?
ఏపీ(AP)లో అధికార కూటమి ప్రభుత్వం(Coalition government) వైసీపీ(YCP) పాలనలో అక్రమాలు..దౌర్జన్యాలకు పాల్పడిన నేతలపై చట్టపర చర్యల విషయమై దూకుడుగా ముందుకెలుతుంది.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)లో అధికార కూటమి ప్రభుత్వం(Coalition government) వైసీపీ(YCP) పాలనలో అక్రమాలు..దౌర్జన్యాలకు పాల్పడిన నేతలపై చట్టపర చర్యల విషయమై దూకుడుగా ముందుకెలుతుంది. తొలుత వైసీపీ సోషల్ మీడియా భరతం పట్టిన చంద్రబాబు ప్రభుత్వం.. ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం అండతో హింసకు పాల్పడిన వారిపైన చర్యలకు ఉపక్రమించింది. కీలక వైసీపీ నాయకులపైన, మాజీ ఎమ్మెల్యేలపైన ఉన్న కేసులను తిరగదోడింది. ఇసుక అక్రమ రవాణా, భూకబ్జా వంటి కేసులలో విచారణ ముమ్మరం చేసింది.
తదుపరి అగ్రీగోల్డ్ భూముల వివాదంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపైన..అదే క్రమంలో ప్రజాపంపిణీ వ్యవస్థ(పీడీఎస్)బియ్యం మళ్లింపు కేసులో మాజీ మంత్రి పేర్నినాని దంపతులపై చట్టం కొరడా జుళిపించింది. ఇటీవల మరో మాజీ మంత్రి విడుదల రజనిపై అట్రాసిటీ కేసు నమోదు చేసింది. తాజాగా టీడీపీ కార్యాలయం దాడి కేసులో వైసీసీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేసి రిమాండ్ చేసింది. ఈ క్రమంలో తదుపరి అరెస్టు మాజీ మంత్రి కొడాలి నాని దే కావచ్చన్న ప్రచారం బలంగా వినిపిస్తుంది. మంగళవారం వంశీని వైసీసీ అధినేత, మాజీ సీఎం వైఎస్. జగన్ వెంట విజయవాడ జైలుకు వచ్చిన కొడాలి నాని ఆనంతరం అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా ప్రచారం వినిపిస్తుంది. తన ఫోన్లు కూడా స్విచాఫ్ చేసుకున్నట్లు సమాచారం.
ఇప్పటికే గుడివాడలో కొడాలి నానిపై మూడు కేసులు నమోదయ్యాయి. తాజాగా లిక్కర్ కుంభకోణంపై విచారణ మొదలైంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తుందని..ఈ మేరకు రాజకీయ అరెస్టులు సాగిస్తుందని వైసీపీ మండిపడుతోంది. కాగా విజయవాడ జైలు వద్ధ నాని మీడియాతో మాట్లాడుతూ కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడితే ఎవ్వడిని వదిలిపెట్టమని..అట్టుపెట్టినోడికి అంటున్నారా రెండట్లు పడతాయిన్నారు. చావైనా బ్రతికైనా జగనన్నతోనే మా ప్రయాణమని స్పష్టం చేశారు.






