నీ చదువులు ఇలా అఘోరించాయా..? అంటూ మంత్రి లోకేష్‌పై వైసీపీ సంచలన ట్వీట్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-06-11 14:22:17  IST  )

ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. అమరావతి మహిళలపై సాక్షి జర్నలిస్టు కృష్ణం రాజు కామెంట్లు చేశారంటూ వార్త‌లు రావ‌డంతో వైసీపీ టీడీపీ మ‌ధ్య మాట‌ల‌ యుద్ధం మొద‌లైంది.

నీ చదువులు ఇలా అఘోరించాయా..? అంటూ మంత్రి లోకేష్‌పై వైసీపీ సంచలన ట్వీట్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. అమరావతి మహిళలపై సాక్షి జర్నలిస్టు కృష్ణం రాజు కామెంట్లు చేశారంటూ వార్త‌లు రావ‌డంతో వైసీపీ టీడీపీ మ‌ధ్య మాట‌ల‌ యుద్ధం మొద‌లైంది. మాజీ సీఎం జగన్ మంత్రి నారాలోకేష్ ఫోటోలను ట్వీట్ చేస్తూ విమర్శలు చేయగా..లోకేష్ తన కాలేజీ రోజుల ఫోటోలు అని కౌంటర్ ఇచ్చారు. తాను చదువుకున్నాను కాబట్టి మిత్రులు ఉన్నారని, జగన్‌కు జైల్లోనే మిత్రులు ఉన్నారని విమర్శించారు. ఇక లోకేష్ ట్వీట్ పై మరోసారి వైసీపీ సోష‌ల్ మీడియా స్పందించింది. కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ నీ కాలేజీ చదువులు ఈ రకంగా అఘోరించాయని ఒప్పుకుంటున్నావన్నమాట అంటూ మండిపడింది. వీటిని చదువులు అనరు.. బహుశా విద్యాశాఖ మంత్రిగా కూడా పిల్లలందరికీ ఇలాగే చదువుకోమని చెప్తావేమో అంటూ అనుమానం వ్యక్తం చేసింది. ఇంతే కదా బుల్లి రాజా, ఇంతకీ నీ ఫీజులు ఎవరు కట్టారు అంటూ ప్రశ్నించింది.

Next Story