- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు ఏపీ వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో వైసీపీ ర్యాలీలు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) చేపట్టిన 'కోటి సంతకాల సేకరణ' ఉద్యమం తుది అంకానికి చేరుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) చేపట్టిన 'కోటి సంతకాల సేకరణ' ఉద్యమం తుది అంకానికి చేరుకుంది. ఈ ఉద్యమంలో భాగంగా సేకరించిన కోటికి పైగా సంతకాల పత్రాలను గవర్నర్‌కు సమర్పించేందుకు నేడు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో వైసీపీ భారీ ర్యాలీలు నిర్వహించనుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నేడు వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేపట్టనున్నారు. ఈ ర్యాలీల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటికి పైగా సేకరించిన సంతకాల పత్రాలను వైసీపీ శ్రేణులు ప్రదర్శించనున్నారు. ర్యాలీలు ముగిసిన అనంతరం, ఈ సంతకాల పత్రాలను జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి పంపనున్నారు. ప్రజల నుంచి సేకరించిన ఈ కోటి సంతకాల పత్రాలను ఈ నెల 18న సాయంత్రం 4 గంటలకు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ ముఖ్య నాయకులు గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అందజేయనున్నారు.
ప్రైవేటీకరణంటూ వైసీపీ ఆరోపణలు..
ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) పద్ధతిలో నిర్వహించాలని తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ 'ప్రైవేటీకరణ'గా అభివర్ణిస్తూ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం పేద విద్యార్థులకు ఉచిత వైద్య విద్య అందించాలనే సంకల్పంతో 17 కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని, ఇందులో ఐదు కళాశాలలు పూర్తి కావొచ్చాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం పీపీపీ విధానం పేరుతో ఈ కళాశాలలను కార్పొరేట్ శక్తులకు అప్పగించి, పేదలకు వైద్య విద్యను, ఉచిత వైద్యాన్ని దూరం చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ ప్రజా ఉద్యమానికి అనూహ్య స్పందన లభించిందని, ప్రజల మనోభావాలను గౌరవించి ప్రభుత్వం తక్షణమే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.






