వైఎస్‌ను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమైన బొత్స

by Vemula.Srinu Prasad |

వైఎస్ మరణాన్ని తలుచుకుని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కంటతడి పెట్టుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతి వెనుక జగన్ మోహన్ రెడ్డి హస్తం ఉందనే అనుమానాన్ని గతంలో బొత్సనే చెప్పారని మంత్రి అచ్చెన్న చేసిన కామెంట్స్‌పై ఆయన మనస్థాపం చెందారు.

వైఎస్‌ను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమైన బొత్స
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ మరణాన్ని తలుచుకుని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(Ycp Mlc Bosta Satyanarayana) కంటతడి పెట్టుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి(Ys Rajasekhar Reddy) మృతి వెనుక జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) హస్తం ఉందనే అనుమానాన్ని గతంలో బొత్సనే చెప్పారని మంత్రి అచ్చెన్న చేసిన కామెంట్స్‌పై ఆయన మనస్థాపం చెందారు. ఈ మేరకు వైఎస్ మరణాన్ని గుర్తు తెచ్చుకుని భావోద్వేగానికి గురయ్యారు. తాను అధికారం కోసం ఎప్పుడూ పాకులాడలేదని చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మృతిపై మంత్రి అచ్చెన్నాయుడు దిగజారి మాట్లాడాడని బొత్స వ్యాఖ్యానించారు. వైఎస్ మృతి చెందిన రోజు జగన్ ఇంట్లోనే ఉన్నారని తెలిపారు. అమరావతిపై విమర్శించాలనుకుంటే రాజకీయంగా మాట్లాడాలని సూచించారు. కానీ కూటమి నేతలు సభ్యత, సంస్కారం లేకుండా రాజకీయ చేస్తున్నారని బొత్స మండిపడ్డారు.

Next Story