ఎగ్జిట్ పోల్స్‌‌‌పై స్పందించిన సజ్జల.. అదే కలిసొచ్చిందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Satheesh |   (  Updated:2024-06-02 11:25:47  IST  )

దేశంలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. దీంతో ఓటర్ల నాడీ ఎలా ఉందో తెలుసుకున్న వేసిన పలు ప్రైవేట్ సంస్థలు, మీడియా

ఎగ్జిట్ పోల్స్‌‌‌పై స్పందించిన సజ్జల.. అదే కలిసొచ్చిందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. దీంతో ఓటర్ల నాడీ ఎలా ఉందో తెలుసుకున్న పలు ప్రైవేట్ సంస్థలు, మీడియా ఛానెళ్లు ఎగ్జి్ట్స్ పోల్స్ అంచనాలను వెల్లడించాయి. ఈ క్రమంలోనే ఏపీలోనే 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందో ఎగ్జిట్స్ పోల్స్‌లో వివరించాయి. అయితే, ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఎగ్జిట్ పోల్స్‌ ద్వారా ఒక స్పష్టమైన క్లారిటీ రాలేదు. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అధికార వైసీపీ, ఎన్డీఏ కూటమికి ఫిఫ్టీ ఫిఫ్టీ చాన్సెస్ ఉన్నాయని అంచనాలు వెల్లడించాయి.

దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీ అధికారం దక్కించుకుంటుందనే దానిపై ఎగ్జిట్ పోల్స్ ద్వారా స్పష్టమైన అవగాహన రాలేదు. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఓ మీడియా చానెల్ ప్రతినిధితో సజ్జల మాట్లాడుతూ.. ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్స్ వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని అన్నారు. పాజిటివ్ అజెండా ఎన్నికల్లో వైసీపీకి కలిసి వచ్చిందని అభిప్రాయపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని, దీంతో భారీ స్థాయిలో మహిళలు మరోసారి వైసీపీని ఆదరించారన్నారు. విపక్షాలు కూటమిగా వచ్చాయని.. సొంతంగా పోటీ చేసే ధైర్యం కూడా చేయలేదని ఎద్దేవా చేశారు.

Next Story