- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్యే టికెట్ కోసం రూ.7కోట్లు ఇచ్చాం.. మహిళ ఆవేదన
రైల్వే కోడూరు టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పి వేమన సతీష్ అనే వ్యక్తి రూ.7 కోట్లు తీసుకున్నాడు అంటూ ఆ పార్టీనేత సుధా మాధవి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కోసం చాలా కష్టపడ్డామని అన్నారు. ఆస్తులు అన్నీ అమ్మి సతీష్ కు రూ.7 కోట్లు ఇచ్చామన్నారు.

దిశ, వెబ్ డెస్క్: రైల్వే కోడూరు టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పి వేమన సతీష్ అనే వ్యక్తి రూ.7 కోట్లు తీసుకున్నాడు అంటూ ఆ పార్టీనేత సుధా మాధవి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కోసం చాలా కష్టపడ్డామని అన్నారు. ఆస్తులు అన్నీ అమ్మి సతీష్ కు రూ.7 కోట్లు ఇచ్చామన్నారు. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు నిరాహార దీక్ష చేశామన్నారు. టీడీపీ పథకాలపై అన్ని గ్రామాలకు తిరిగి ప్రచారం చేశానని తెలిపారు. తాము చేస్తున్న కార్యక్రమాల గురించి తెలిసి వేమన సతీష్ అనే వ్యక్తి వచ్చి చంద్రబాబు, లోకేష్ తెలుసని చెప్పి నమ్మించాడన్నారు.
అతడు చెప్పిన మాటలు నమ్మి ఆస్తులు అమ్మి, అప్పులు చేసి రూ.7 కోట్లు ఇచ్చామన్నారు. తమకు జరిగిన అన్యాయం గురించి కావాలంటే స్థానిక టీడీపీ నేతలను అడగాలన్నారు. విషయం చెప్పడానికి టీడీపీ కార్యాలయానికి వెళ్లడానికి ప్రయత్నిస్తే కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లారన్నారు. డబ్బులు అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లకు భయపడి ఊర్లో ఉండటం లేదన్నారు. సతీష్ అనే వ్యక్తి నుండి డబ్బులు ఇప్పించాలని కోరారు. న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదన్నారు.






