VIDEO: బస్సులో సీటు కోసం రచ్చరచ్చ.. ప్రయాణికుడి జుట్టుపట్టుకుని కొట్టిన మహిళ

by Ajay Maddhiboyina |

ఇటీవ‌లికాలంలో ఆర్టీసీ బ‌స్సుల్లో సీట్ల కోసం కొట్టుకుంటున్న ఘ‌ట‌న‌లు పెరిగిపోతున్నాయి. ఒక‌ప్పుడు సీట్ల కోసం కేవ‌లం మ‌హిళ‌లు మాత్ర‌మే కొట్టుకునేవారు. కానీ ఇప్పుడు సీటు కోసం మ‌హిళ‌లు పురుషుల మ‌ధ్య కూడా గొడ‌వ‌లు జ‌రుతున్నాయి.

VIDEO: బస్సులో సీటు కోసం రచ్చరచ్చ.. ప్రయాణికుడి జుట్టుపట్టుకుని కొట్టిన మహిళ
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవ‌లికాలంలో ఆర్టీసీ బ‌స్సుల్లో సీట్ల కోసం కొట్టుకుంటున్న ఘ‌ట‌న‌లు పెరిగిపోతున్నాయి. ఒక‌ప్పుడు సీట్ల కోసం కేవ‌లం మ‌హిళ‌లు మాత్ర‌మే కొట్టుకునేవారు. కానీ ఇప్పుడు సీటు కోసం మ‌హిళ‌లు పురుషుల మ‌ధ్య కూడా గొడ‌వ‌లు జ‌రుతున్నాయి. ఆ గొడ‌వలు కేవ‌లం తిట్ల‌కే ప‌రిమితం కాకుండా కొట్టుకునే వ‌ర‌కు వెళుతున్నాయి. తాజాగా ఏపీలోని తుని నుండి న‌ర్సీప‌ట్నం వెళుతున్న ఆర్టీసీ బ‌స్సులో అలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది. సీటు కోసం ఓ మహిళ పురుషుడి మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది.

ఈ క్ర‌మంలో మాటామాట పెరిగి మ‌హిళ ప్రయాణికుడి జుట్టు పట్టుకుని కొట్టింది. దీంతో ప్ర‌యాణికులు అంతా నివ్వెర‌పోయారు. ఆ ప్ర‌యాణికుడు సైతం ప్రతిఘ‌టించ‌డంతో ర‌చ్చ‌ర‌చ్చ‌గా మారింది. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. అయితే సీటు కోసం గొడ‌వ‌లకు ఉచిత బ‌స్ ప‌థ‌కమే కార‌ణం అనే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. పురుషులు టికెట్ తీసుకుని నిల‌బ‌డి ప్ర‌యాణిస్తే మ‌హిళ‌లు ఉచితంగా ఎక్కుతూ సీట్ల‌లో కూర్చుకుంటున్నార‌ని, దానివ‌ల్ల‌నే గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. video

Next Story