- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రకాశం బ్యారేజీ పై నుంచి దూకిన మహిళ
విజయవాడ(Vijayawada) ప్రకాశం బ్యారేజ్(Prakasam barrage) పై నుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

X
దిశ,వెబ్‌డెస్క్: విజయవాడ(Vijayawada) ప్రకాశం బ్యారేజ్(Prakasam barrage) పై నుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ వేగంగా బ్యారేజీ వద్దకు నడుచుకుంటూ వచ్చి.. కృష్ణానదిలోకి దూకేసింది. ఈ ఘటనను సకాలంలో గుర్తించిన NDRF బృందం వెంటనే యాక్షన్ ప్లాన్ అమలు చేసింది. ఈ క్రమంలో డ్రోన్లు, వాటర్ బెలూన్లు వాడి ఆ మహిళ ప్రాణాలు కాపాడారు. అయితే ఆ మహిళ కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు మహిళ కుటుంబీకులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. సకాలంలో స్పందించి మహిళ ప్రాణాలు కాపాడి రెస్క్యూ టీమ్స్ శభాష్ అనిపించుకున్నారు. ప్రకాశం బ్యారేజ్‌లో NDRF పోలీసుల సాహసానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Next Story






