- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముచ్చుమర్రి ఘటన..బాలిక మృతదేహం అందుకే దొరకడం లేదా?
ఏపీలో ఇటీవల ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన ఘటన కలకలం రేపింది. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి లో బాలిక మృతదేహం ఇంకా లభ్యం కాలేదు.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఇటీవల ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన అత్యచారం ఘటన కలకలం రేపింది. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి లో బాలిక మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు. ఈ క్రమంలో బాలిక మృతదేహం కోసం పోలీసులు ఆ ముగ్గురు మైనర్లను ఆరా తీయగా వారు చెప్పిన కాలువలు, చెరువులు, శ్మశానంలోను గాలించారు. అయినా కూడా ఆ బాలిక మృతదేహం లభ్యం కాలేదు. బాలిక మృతదేహం ఆచూకీ ఇంకా తెలియరాకపోవడంతో స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి స్థానిక ప్రజలు మరో కారణం చెబుతున్నట్లు తెలుస్తోంది. నిందితుల్లో ఓ బాలుడి తాత ఆ చిన్నారి శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి కృష్ణా బ్యాక్ వాటర్‌లో పడేసినట్లు సమాచారం. ఆ ముక్కలను నీటి కుక్కలు, చేపలు తినేసి ఉంటాయని, అందుకే శవం దొరకడం లేదని చెబుతున్నారు. లేదంటే రాయి కట్టినా శవం నీటిలో పైకి తేలేదని చర్చించుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది.






