- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
YS Jagan: ఏపీ గురించి రాహుల్ ఎందుకు మాట్లాడటం లేదు ?
'రాహుల్ ఏపీ గురించి ఎందుకు మాట్లాడటం లేదు? చంద్రబాబుతో రాహుల్ హాట్ టచ్ లో ఉన్నాడు..

చంద్రబాబుతో టచ్ లో రాహుల్ గాంధీ
వైసిపి అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు..
దిశ, డైనమిక్ బ్యూరో : 'రాహుల్ ఏపీ గురించి ఎందుకు మాట్లాడటం లేదు? చంద్రబాబుతో రాహుల్ హాట్ టచ్ లో ఉన్నాడు.. రేవంత్ ద్వారా బాబు కాంగ్రెస్ అధిష్టానంతో టచ్ లో ఉంటారు..' పని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో జరిగిన జడ్పిటిసి ఎన్నికలపై ఆయన ఈరోజు తాడేపల్లి లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడాడు. 'బాబు గురించి మాణిక్యం ఠాకూర్ ఒక్కకామెంట్ ఎందుకు చేయరు, ఏపీలో ఎన్నో స్కామ్ లు జరుగుతున్నాయి, అమరావతి నిర్మాణం పెద్ద స్కాం.. కాంగ్రెస్ ఎందుకు మాట్లాడటం లేదు?' అని జగన్ ప్రశ్నించారు. ఏపీలో 2024 ఎన్నికల నాటికి ,.. లెక్కింపు సమయానికి 12.5 ఓట్లు పెరిగాయన్నారు. ఓటింగ్తర్వాత 48 లక్షల ఓట్లు పెరిగాయని ఇది ఎలా సాధ్యం అన్నారు.
బందిపోట్ల ముఠా నాయకుడు చంద్రబాబు
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ శ్రేణులు చంబల్ వ్యాలీలో బందిపోట్లను మరిపించారరని, ఆ బందిపోట్ల ముఠా నాయకుడు చంద్రబాబు అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని, పులివెందులలో నిన్న జరిగిన ఘటనలే దీనికి నిదర్శనమన్నారు. వైసీపీ ఏజెంట్లు లేకుండా పోలింగ్‌ను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. 15 పోలింగ్ బూత్‌లలో వైసీపీ ఏజెంట్లు కూర్చోనీయలేదని ఆరోపించారు. ఇంత అన్యాయంగా ఎన్నికలు ఎప్పుడూ జరగలేదన్నారు. పచ్చ చొక్కా వేసుకున్న డీఐజీ కోయ ప్రవీణ్ టీడీపీకి చెందిన మాజీ ఎంపీ సమీప బంధువని ఆరోపించారు. డీఐజీతో వచ్చిన ఎస్పీ, డీఎస్పీ, సీఐలు కూడా వాళ్ల మనుషులేనని వ్యాఖ్యానించారు. బాబు మాట వికనపోతే డీజీ స్థాయి వాళ్లు కూడా జైలుపాలే అని మండిపడ్డారు.
కలెక్టర్ సమక్షంలోనే దొంగ ఓట్లు
కడప కలెక్టర్ సమక్షంలోనే టీడీపీ నేతలు దొంగ ఓట్లు వేశారని, ఆ ఫొటోలను జగన్ ప్రదర్శించారు. జమ్మలమడుగుకు చెందిన సందీప్, దస్తగిరి, టీడీపీ సర్పంచ్ మారెడ్డి చిన్నపుల్లారెడ్డి, టీడీపీ నేత నాగేశ్వరరెడ్డి దొంగ ఓటు వేశారని ఆరోప ణలు చేశారు. పోలింగ్ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు అరాచకం సృష్టించారని విమర్శించారు. మంత్రులు రాంప్రసాదెడ్డి, సవిత ఎర్రబల్లిలో తిష్టవేశారని పేర్కొన్నారు. బీటెక్ రవి అసలు పులివెందుల రూరల్ ఓటరే కాదని, అయినా కణంపల్లిలో ఉండి దౌర్జన్యం చేశారని ఆరోపించారు. ఎర్రబల్లె వాళ్లు నల్లపురెడ్డిపల్లె వెళ్లి.. నల్లపురెడ్డిపల్లె వాళ్లు ఎర్రబల్లె వెళ్లి ఓటు వేసేలా చంద్రబాబు స్కెచ్వేశారని విమర్శించారు. చంద్రబాబు దమ్ముంటే మళ్లీ ప్రజాస్వామ్యబద్ధంగా కేంద్ర బలగాలతో ఎన్నిక జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రతి బూత్లో వెబ్ కాస్టింగ్ ఇచ్చే ధైర్యం ఉందా? అని జగన్ ప్రశ్నించారు.






